ETV Bharat / state

జగన్ మామయ్యా మా కళాశాలకు నిధులు మంజూరు చేయండి : ఐటీఐ విద్యార్థులు - Mylavaram ITI students news

Mylavaram I.T.I students Suffer With Classrooms: వైఎస్‌ఆర్‌ జిల్లా మైలవరంలోని ఐటీఐ కళాశాలలో సరిపడా తరగతి గదులు, మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులందరికీ కళాశాలలో ఒకే గదిని కేటాయించడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కొత్త కళాశాల కోసం మైలవరంలో మూడు ఎకరాల స్థలాన్ని కేటాయించినా, ప్రభుత్వం సకాలంలో నిధులు కేటాయించకపోవడంతో నిర్మాణ పనులు ముందుకు సాగడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

mylavaram_iti_students
mylavaram_iti_students
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2023, 3:52 PM IST

Mylavaram I.T.I Students Suffer With Classrooms: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, మైలవరంలో కొత్త కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఐటీఐ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. తమ కళాశాలలో సరిపడా తరగతి గదుల్లేక, కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులందరికీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకే గదిని కేటాయించడంతో అసౌకర్యంగా ఉందని వాపోతున్నారు. కొత్త కళాశాల కోసం మైలవరంలో మూడు ఎకరాల స్థలాన్ని కేటాయించినా, ప్రభుత్వం సకాలంలో నిధులు కేటాయించకపోవడంతో నిర్మాణ పనుల నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జగన్ మామయ్యా మా కళాశాలకు నిధులు మంజూరు చేయండి : ఐటీఐ విద్యార్థులు`

Students Fire on YSRCP Govt: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన వైఎస్సార్ జిల్లా మైలవరంలో ఐటీఐ విద్యార్థులు తరగతి గదుల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. విద్యార్థులందరికీ కళాశాలలో ఒకే గదిని కేటాయించడంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కళాశాలను తాత్కాలికంగా జమ్మలమడుగుకు మార్చినప్పటికీ అక్కడ కూడా గదులు అధ్వానంగా ఉన్నాయంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో నిధులు కేటాయించి, కొత్త కళాశాల నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

SSBN College students: 'కళాశాలను ప్రైవేటీకరించేందుకు లోలోపల కుట్ర'

Students Comments: ''వైయస్సార్ జిల్లా మండల కేంద్రమైన మైలవరంలో 2015వ సంవత్సరంలో జూనియర్ ఐటీఐ కళాశాల మంజూరు అయ్యింది. కళాశాలలో ఒక గదిని మాత్రమే విద్యార్థులకు కేటాయించారు. దీంతో మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. చాలా అసౌకర్యంగా కూడా ఉంది. ఆ తర్వాత మమ్మల్ని జమ్మలమడుగు ఐటీఐలోకి తాత్కాలికంగా మార్చారు. కానీ, అక్కడ కూడా సరైన సదుపాయాలు లేవు. కొన్ని పనులు మాత్రమే జరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వం సకాలంలో నిధులు కేటాయించకపోవడంతో మిగతా నిర్మాణ పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇప్పటికైనా సీఎం జగన్, అధికారులు స్పందించి మాకు అన్ని వసతులతో కూడిన కళాశాలను కట్టించాలని డిమాండ్ చేస్తున్నాం.'' అని పలువురు ఐటీఐ విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.

మా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: ఎన్టీఆర్​ వెటర్నరీ కళాశాల విద్యార్థులు

68 Students, One Lecturer: ప్రస్తుతం మైలవరం ఐటీఐ కళాశాల తరగతి గదులు జమ్మలమడుగు ప్రభుత్వ కళాశాల ఆవరణలోనే కొనసాగుతున్నాయని విద్యార్థులు తెలిపారు. ఫిట్టర్, ఎలక్ట్రిషన్‌తో పాటు సివిల్ కోర్సులకు సంబంధించిన పాఠాలు బోధిస్తున్నారని పేర్కొన్నారు. మొత్తం 68 మంది విద్యార్థులు ఉంటే రెండు గదుల్లో, ఒకరే అధ్యాపకుడు పాఠాలు చెప్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వం, అధికారులు తమ ఇబ్బందులను గుర్తించి, నిధులు లేక నిలిచిపోయిన కళాశాలను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రభుత్వం కేటాయించిన స్థలం ఇంకా మా చేతికి అందలేదు. స్థలంతో పాటు, నిర్మాణ పనులకు సంబంధించి నాలుగు కోట్ల 98 లక్షల రూపాయలతో ఎస్టిమేషన్ వేసి, ప్రభుత్వానికి పంపించాం. ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే, మైలవరంలో మూడు ఎకరాల స్థలంలో కళాశాల నిర్మాణ పనులు ముందుకు సాగుతాయి. -నవరూప్ కుమార్, కళాశాల ఇంఛార్జ్

గుంటూరు వైద్య కళాశాల విద్యార్థులు..నవతరపు సేవతరంగాలు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.