ప్రజలెవరూ బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే ఆదేశించారు. కిరాణా సరుకులు తీసుకునేటప్పుడు ప్రజలు సామాజిక దూరం పాటించాలని సూచించారు. పట్టణంలో మూడు చోట్ల ఏర్పాటు చేస్తున్న రైతుబజార్లను పరిశీలించి సలహాలు ఇచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల కోసం తన 2 నెలల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. ఈనెల 29వ తేదీ నుంచి చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేయబోయే బియ్యం, కందిపప్పు పేదలకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏప్రిల్ 4వ తేదీన వెయ్యి రూపాయలు నగదు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: లాక్డౌన్: యువకులపై లాఠీఛార్జి