ETV Bharat / state

సీఏఏ బిల్లును వ్యతిరేకిస్తూ... రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు

ఎన్నార్సీ, సీఏఏ బిల్లులను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు ఆందోళనలు చేపట్టారు. భిన్నత్వంలో ఏకత్వంగా ప్రజలు జీవించే మన దేశంలో... కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కేంద్రం ఈ బిల్లులను ప్రవేశ పెట్టిందని ఆందోళనకారురలు ఆరోపించారు.

muslims rally throughout the state opposing cab bill
సీఏఏ బిల్లును వ్యతిరేకిస్తూ...రాష్ట్రవ్యాప్తంగా ముస్లింల ర్యాలీ
author img

By

Published : Dec 19, 2019, 8:31 PM IST

Updated : Dec 19, 2019, 9:28 PM IST

సీఏఏ బిల్లును వ్యతిరేకిస్తూ...రాష్ట్రవ్యాప్తంగా ముస్లింల ర్యాలీ

కేంద్రం అమలు పరచిన పౌరసత్వ బిల్లును రద్దు చేయాలని... రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు వివిధ పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. కృష్ణా, కడప, విశాఖ, కర్నూలు, ప్రకాశం, పశ్చిమగోదావరి, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లోని ప్రధాన కూడళ్లలో నిరసనలు చేశారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని ఆందోళనకారులు హెచ్చరించారు. మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడాన్ని.. .పౌరులకు అభద్రత కల్పించే పౌరసత్వ చట్టాలను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని పలువురు నేతలు విజ్ఞప్తి చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుకు తేదేపా, వైకాపా నాయకులు మద్దతు పలకడం దారుణమన్నారు. ఈ బిల్లును కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ వామపక్షాలు డిమాండ్ చేశాయి.

ఇదీ చదవండి:

అమరావతిలో రైతుల ఆందోళన తీవ్రతరం

Intro:Ap_cdp_46_19_NRC CAA_rastaroko_Av_Ap10043
k.veerachari, 9948047582
ఎన్ఆర్సీ, సీఏఏకి వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు కడప జిల్లా రాజంపేటలో ఎన్ఆర్సీ, సీఏఏ ను వ్యతిరేకిస్తూ స్థానిక ఏఐటీయూసీ కార్యాలయం నుంచి ప్లకార్డులు ప్రదర్శిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో సిపిఐ, సిపిఎం, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ, ముస్లిం మైనారిటీలు జాతీయ రహదారిపై ఎన్టీఆర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవేశపెట్టిన ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వంమైన భారతదేశంలో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశ పెట్టిందని ధ్వజ మెత్తారు. ఈనెల 23న పాఠశాలల బంద్కు పిలుపునిచ్చినట్లు సిపిఐ నాయకుడు నరసింహ తెలిపారు.

Body:ఎన్ఆర్సీ, సీఏఏకి వ్యతిరేకంగా రాస్తారోకో

Conclusion:సిపిఐ నాయకుడు మహేష్
Last Updated : Dec 19, 2019, 9:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.