కడప జిల్లా మైదుకూరులో ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికురాలు మేరి (35) మృతి చెందారు. విధుల్లో పాల్గొనేందుకు అరుంధతి నగర్ నుంచి పురపాలక కార్యాలయానికి భర్తతో కలిసి వస్తుండగా.. వారి ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొంది. ప్రమాదంలో మేరి అక్కడికక్కడే మృతి చెందారు. భర్త బాలరాజు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి కారణమైన కారును సంఘటనా స్థలంలో ఆపకుండా వెళ్లిపోయారు. మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి : వరి కోతలపై కరోనా ఎఫెక్ట్... ఆందోళనలో గోదావరి రైతులు