కడప జిల్లా బద్వేలు మునిసిపాలిటీని రూ.130 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు పురపాలక ఛైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి తెలిపారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు భవన్లో మొదటి కౌన్సిల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.
బద్వేల్ పురపాలికలోని 35 వార్డుల్లో ఎక్కువ సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. రహదారులు, మురుగు కాలువల వ్యవస్థ మరమ్మతులకు అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు. ప్రతి వార్డులో పొడి, తడి చెత్త సేకరించనున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: