కడప జిల్లా రాయచోటి పురపాలిక ఎన్నికల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. తొలుత వార్డుల వారీగా ఓటర్ల జాబితాను రూపొందించారు. ఒక్కో వార్డుకు వెయ్యి నుంచి 2వేల ఓట్లు ఉండేలా జాబితాను తయారు చేశామని పురపాలిక కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ జాబితాను అన్ని వార్డుల్లో ప్రజలకు అందుబాటులో ఉంచామని చెప్పారు. త్వరలోనే వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు.
ఇవి కూడా చదవండి: