ETV Bharat / state

సమాన పనికి సమాన వేతనం కోసం మున్సిపల్ కార్మికుల ధర్నా

కనీస వేతనం 18000 రూపాయలు ఇవ్వాలంటూ కడపలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేపట్టారు. నగరపాలక కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ మున్సిపల్ కార్మికుల ధర్నా
author img

By

Published : Jul 24, 2019, 12:59 PM IST

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ మున్సిపల్ కార్మికుల ధర్నా

సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ కడప నగరపాలక కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఆఫీసు ప్రధాన ద్వారాన్ని మూసి కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కనీస వేతనం 18000 రూపాయలు ఇవ్వాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి జీతాలు పెంచుతామని చెప్పి.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. మున్సిపల్ కార్మికులకు ఇవ్వాల్సిన నూనె, చెప్పులు తదితర సామాగ్రిని పంపిణీ చేయలేదన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి..

కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్​ బస్సు.. విద్యార్థులు సురక్షితం

Intro:slug: AP_CDP_36_24_POLICE_VAIPHALYAM_PKG_AP10039
contributor: arif, jmd
ఆ బాంబులు ఎవరు పెట్టారు?
( ) ఫ్యాక్షన్ గడ్డ మరోసారి ఉలిక్కిపడింది. కడప జిల్లా జమ్మలమడుగులో ఏకంగా 54 నాటు బాంబులు బయటపడడంతో పోలీసులు విస్తుపోయారు. 2 వారాల క్రితం జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం రామచంద్ర పల్లి గ్రామంలో రెండు నాటు బాంబులు పేలి ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సంఘటన మరువకముందే జమ్మలమడుగు శివారులో 54 బాంబులు భూమిలో పాతిపెట్టిన బాంబులు గుర్తించడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ముఖ్యమంత్రి కోసం ఇటీవల నిర్మించిన హెలిప్యాడ్ స్థలనికి కొద్ది దూరంలో ఇవి బయటపడటం గమనార్హం దీంతో పోలీసుల వైఫల్యం బట్టబయలైంది

వాయిస్ ఓవర్1: ఈనెల 11వ తేదీన మైలవరం మండలం రామచంద్రయ్య పల్లి పొలాల్లో నాటు బాంబులు పేలి అదే గ్రామానికి చెందిన సోమశేఖర్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు .తన పొలాన్ని చదువు చేస్తుండగా భూమిలో పాతిపెట్టిన ఓ ఇనుప బకెట్ లో రెండు నాటు బాంబులు పేలడంతో ఆ యువకుడికి గాయాలయ్యాయి. ఖచ్చితంగా 11 రోజుల తర్వాత జమ్మలమడుగు శివారులో పెద్ద సంఖ్యలో 54 నాటుబాంబులు కనుగొనడం పోలీసులకు సవాలుగా మారింది. జమ్మలమడుగు -ముద్దనూరు రహదారి లో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి .ఈ మార్గమధ్యంలో ఉక్కు కర్మాగారం వస్తుందని ఆశతో పలువురు తమ పొలాలను వెంచర్లు గా మారుస్తున్నారు. ఈ నేపథ్యంలో పెన్నా నది సమీపంలో ఓ వ్యాపారి తన పొలాన్ని తన భూమిని పొక్లెయిన్ సహాయంతో చదువు చేస్తున్నాడు. పొక్లెయిన్ ఒక స్టీల్ బకెట్ తగలడంతో అక్కడున్న కార్మికులు పోలీసులకు సమాచారం అందించారు .తన సిబ్బందితో సహా వచ్చి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఒక ఒక బకెట్లో పది బాంబులు దొరికాయి ,పక్కనే మరో ప్లాస్టిక్ బకెట్లు నాలుగు బాంబులు కనుగొన్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని ఉంటాయని అనుమానంతో పరిశీలించారు సమీప ప్రాంతంలోని రెండు ప్లాస్టిక్ బకెట్లు గుర్తించారు .ట్యాంకర్ల సహాయంతో వాటిని నీటితో తడిపేసి లెక్కించగా ఒక్కో దాంట్లో 20 బాంబులు ఉన్నట్లు కనుగొన్నారు. మొత్తం నాలుగు బకెట్లలో 54 బాంబులు గుర్తించారు. ఫ్యాక్షన్ గడ్డగా పేరున్న జమ్మలమడుగు ప్రాంతంలో ఒకేసారి ,ఒకే చోట 54 బాంబులు భూములు దొరకడం చర్చనీయాంశమైంది

వాయిస్ ఓవర్2 ఈ నెల 8న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు దినోత్సవం పురస్కరించుకొని జమ్మలమడుగు సభలో పాల్గొన్నారు. సభ కోసం బాంబులు దొరికిన ప్రాంతంలోనే హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు .ఈ హెలిప్యాడ్ కు సుమారు 150 మీటర్ల దూరంలో ఇవి దొరకడం పోలీస్ లకు సవాలుగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన పోలీసులే నిర్లక్ష్యంగా ఉన్నారని నియోజకవర్గ ప్రజలు ఆరోపిస్తున్నారు

ఎండ్ వాయిస్ ఓవర్: రెండు వారాల పరిధిలోనే జమ్మలమడుగు నియోజకవర్గంలో జమ్మలమడుగు, మైలవరం ప్రాంతాల్లో బాంబులు గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది .ఫ్యాక్షన్ గ్రామాల్లో సోదాలు నిర్వహించి ఉన్న బాంబులను ఏరివేయాలని పలువురు సూచిస్తున్నారు

Body:ఫ్యాక్షన్ గడ్డలో బాంబులు

Conclusion:ఫ్యాక్షన్ గడ్డలో బాంబులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.