కడప జిల్లా పులివెందులలోని సీఎం క్యాంపు కార్యాలయంలో.. ప్రజా సమస్యలపై.. ఎంపీ అవినాష్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి అక్కడకు వచ్చిన ప్రజల సమస్యలను.. ఎంపీ అడిగి తెలుసుకున్నారు. వారి వద్ద నుంచి వినతి పత్రాలను స్వీకరించి.. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. తన పరిధిలో లేని అంశాలను.. సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
పులివెందుల మున్సిపాలిటీలోని పారిశుద్ధ్య కార్మికులకు.. ఆరు నెలలుగా జీతాలు రావడం లేదంటూ.. తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాంట్రాక్ట్ పద్ధతలో జీతాలు చెల్లించే వారని.. ఇప్పుడు ఆప్కాస్ కమిటీ నుంచి జీతాలు సక్రమంగా రావటం లేదని వాపోయారు. పాత పద్దతిలోనే వారికి జీతాలు ఇవ్వాలంటూ.. ఎంపీకి విజ్ఞప్తి చేశారు. వారి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: