కడప జిల్లాలో కొత్తగా 71 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు వెయ్యి మార్క్ దాటాయి. ఇవాళ నమోదైన 71 కేసుల్లో కడప-26, ప్రొద్దుటూరు-15, మైలవరం-4, సీకేదిన్నె-5, మైదుకూరు-5, రాజంపేట-3, రైల్వేకోడూరు, దువ్వూరు, సింహాద్రిపురం, ముద్దనూరు, కలసపాడు, ఎర్రగుంట్ల, రాయచోటి, బద్వేలు మండలాల్లో ఒక్కొక్కరి చొప్పున వైరస్ బారిన పడ్డారు. పులివెందుల, రాజుపాలెం మండలాల్లో 2 కేసులు చొప్పున నమోదు కాగా విదేశాల నుంచి వచ్చిన ఒకరికి కరోనా సోకిందని జిల్లా వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.
జిల్లా కోవిడ్ ఆసుపత్రి నుంచి 40 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మొత్తం 402 మంది జిల్లాలో డిశ్చార్జి అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు దాదాపు 70 వేల కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా.. 65 వేల ఫలితాలు వచ్చాయి. ఇంకా 3700 ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. విదేశాల నుంచి జిల్లాకు ఇప్పటివరకు 7220 మంది వచ్చినట్లు అధికారులు ప్రకటనలో తెలిపారు. కువైట్ నుంచి వచ్చిన 141 మందికి కూడా కరోనా సోకిందన్నారు.
ఇదీ చదవండి:
'మా గ్రామాన్ని అభివృద్ధి చేయండి.. 14 అంశాల్లో సహకారం అందించండి'