ఓట్లేసిన ప్రజలనే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారని తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి దుయ్యబట్టారు. వైకాపా అధికారంలోకి వచ్చాక సుధీర్ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆదివారం జమ్మలమడుగు ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మీడియాతో ఆయన మాట్లాడారు.
గండికోట జలాశయం పరిహారం విషయంలో పలువురు నాయకుల నుంచి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పెద్ద ఎత్తున కమీషన్లు తీసుకున్నారు. కొండాపురం మండలం పి.అనంతపురంలో గురు ప్రతాప్ రెడ్డి హత్యకు ప్రణాళిక వేసింది వైకాపా వర్గీయులే. న్యాయ విచారణ జరిపిస్తే నిజాలు బయటకు వస్తాయి. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంటే సీఎం జగన్ అసహ్యించుకుంటారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ వచ్చే పరిస్థితి లేదు. సింగల్ టైం ఎమ్మెల్యేగా సుధీర్ మిగిలిపోతారు.ఇక్కడ సంపాదించిన అవినీతి సొమ్ముతో విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఆయన భారీగా స్థలాలు కొంటున్నారు- బీటెక్ రవి, ఎమ్మెల్సీ
ఇదీ చదవండి