రూ. 3.15 కోట్లతో మైదుకూరు సామాజిక ఆసుపత్రిని ఆధునికీకరించే పనులను ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రారంభించారు. అభివృద్ధి పనులతో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి వ్యవసాయం, విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తున్నారన్నారు.
అందులో భాగంగానే ఆసుపత్రి ఆధునికీకరణకు నిధులు మంజూరు చేశారని పేర్కొన్నారు. వంద పడకల ఆసుపత్రి నిర్మించాలని పంపిన ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలపగా.. భవనాలతోపాటు అంతర్గత రహదారులు, ప్రహరీకి ప్రతిపాదనలు పంపామన్నారు. వీటి కోసం 6 ఎకరాలు కేటాయించినట్లు వెల్లడించారు.
ఇవీ చూడండి: