ETV Bharat / state

మైదుకూరులో తెరుచుకోనున్న దుకాణాలు

లాక్​డౌన్​తో రెండు నెలలుగా మూతపడ్డ దుకాణాలు కడప జిల్లాలో తెరుచుకోనున్నాయి. మంగళవారం మైదుకూరులోని ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి మార్గదర్శకాలు తెలియజేశారు.

mla Raghuram Reddy constituency level meeting
ఎమ్మెల్యే రఘురామిరెడ్డి నియోజకవర్గ స్థాయి సమావేశం
author img

By

Published : May 20, 2020, 12:39 PM IST

మైదుకూరు ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. నగరంలో నమోదైన 4 పాజిటివ్ కేసు బాధితులు డిశ్చార్జ్​ కావడం.. దుకాణాదారుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకొని అన్నిరకాల దుకాణాలు తెరిపించేలా ప్రయత్నం చేస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నెల 14న ఆటోవాలాలు, నాయీ బ్రాహ్మణులకు పదివేల రూపాయల చొప్పున ప్రభుత్వం సహాయం అందజేయనున్నట్లు తెలిపారు.

ఆగస్టు 3న పాఠశాలలను పున ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నాడు - నేడు కింద చేపట్టిన పనులన్నింటినీ పూర్తి చేసిలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ నెల 30న ప్రారంభించే రైతు భరోసా కేంద్రాల ద్వారా క్రిమిసంహారక మందులు, ఎరువులు, విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు రఘురామిరెడ్డి స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

ఈయనెవరో గుర్తు పట్టారా? సైకిల్ పై ఎందుకు తిరిగారో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.