MLA Rachamallu Siva Prasad Reddy Key comments: నిన్నా మెున్నటి వరకూ పోలీసులకు తనేంటో చూపిస్తా అన్న ఎమ్మెల్యే, నేడు ముందస్తు జాగ్రత్తలు, సూచనలు చేశారు. అక్రమ మద్యం రవాణా చేయడం తప్పు అని పోలీసులు, ఉన్నతాధికారులకు సహకరించాలని సూచించారు. అలాగే పోలీసులు సైతం అత్యుత్సాహం ప్రదర్శించకూడదని పేర్కొన్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకూ డబ్బు, మద్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పోలీసులు అత్యుత్సాహం: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి తన నియోజకవర్గ ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు సూచించారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం మంచిది కాదని రాచమల్లు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పోలీసులు అత్యత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు వివిధ అవసరాల కోసం తీసుకెళ్తున్న డబ్బును సీజ్ చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా డబ్బులు, మద్యం తరలింపు పేరుతో సామాన్యులను ఇబ్బందులకు గురి చేయవద్దని పోలీసులకు సూచించారు.
మహిళా ఎస్ఐపై దాడి ఘటనలో ఎమ్మెల్యే రాచమల్లు హస్తం : ప్రవీణ్ కుమార్ రెడ్డి
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలు వివిధ అవసరాలకు 50 వేల కన్నా ఎక్కువ నగదు తీసుకెళ్ల వద్దని తెలిపారు. ఒకవేళ డబ్బులు తీసుకు వెళ్లాల్సి వస్తే అందుకు సంబంధించిన పత్రాలను దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ఎన్నికలు పూర్తి అయ్యే వరకు బ్యాంకు ద్వారా లావాదేవీలు జరిపితే ఇబ్బందులు ఉండవన్నారు. మద్యం అలవాటు ఉన్న వ్యక్తులు మూడు మద్యం బాటిళ్లకు మించి తీసుకెళ్ల కూడదని చెప్పారు. ఎన్నికలు అయిపోయే వరకూ మందుబాబులు సమన్వయం పాటించాలని ఎమ్మెల్యే రాచమల్లు సూచించారు.
పార్టీకీ తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే తీరు: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలీసులపై ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా మాట్లాడటంతో పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది. ఈనెల మద్యం సీసాలతో పట్టుబడిన పుల్లయ్య అనే వ్యక్తిని ఏకంగా ప్రొద్దుటూరు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ కార్యాలయం నుంచి ఇంటికి తీసుకెళ్లడమే కాకుండా కార్యాలయంలో విధుల్లో ఉన్న ఎస్ఐ బేగ్‌పై రాచమల్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎస్పీకి కాదు, వాళ్ల బాబుకి చెప్పుకో అంటూ దూషించారు. కేసు పెడితే ఒప్పుకోనన్న ఆయన చట్టాన్ని మార్చుకో, లేకపోతే ప్రభుత్వాన్ని మార్చుకో అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇలా బల్లగుద్ది ఎమ్మెల్యే మాట్లాడం అది నేరుగా రాష్ట్ర ప్రభుత్వాన్నే విమర్శించినట్లుగా ఉందని వైసీపీలో చర్చకు దారి దీసింది. ఎమ్మెల్యే తిట్ల పురాణం మీడియాలో ప్రముఖంగా రావడంతో శుక్రవారం తెలుగుదేశంతో సహా విపక్షాలన్నీ తప్పు బట్టాయి. రాచమల్లు ప్రసాద్ రెడ్డిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండు చేశారు.