కడప జిల్లా రైల్వే కోడూరులో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మృత్యుంజయ హోమం నిర్వహించారు. ప్రజలందరినీ కరోనా వైరస్ నుంచి కాపాడాలంటూ దేవదేవుడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఈ హోమం నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంతో పాటు జిల్లా, రాష్ట్రం, దేశం నుంచి కరోనా వైరస్ను తరిమి కొట్టాలంటే ప్రజలందరూ ప్రభుత్వ సూచనలను పాటించాలని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న పేదలందరికీ వైకాపా నాయకులు, కార్యకర్తలు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయటం చాలా మంచి పరిణామమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్ర బ్రాహ్మణ అభ్యుదయ సేవాసమితి ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు.
ఇదీ చూడండి: