జిల్లాలో ఇప్పటివరకు వైరస్ వ్యాప్తి నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టారు, ప్రభుత్వ ఆదేశాలు ఎలా అమలవుతున్నాయనే దానిపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆదిమూలపు సురేశ్ సమీక్ష నిర్వహించారు. దిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు కడప జిల్లాలో కూడా కొందరు ఉన్నారు. వారందరినీ రిమ్స్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, ఎంపీ అవినాశ్‌రెడ్డి, జిల్లా వైకాపా ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఎస్పీతోపాటు జిల్లా అధికారులంతా సామాజిక దూరం పాటిస్తూ ఈ సమీక్షలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'చౌకధరల దుకాణాల వద్ద కనిపించని సామాజిక దూరం'