కడప జిల్లా ప్రొద్దుటూరులోని కొర్రపాడు రోడ్డులో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కుల్లు సుబ్బరాయుడు(43) అనే వ్యక్తి మృతి చెందాడు. కానపల్లెకు చెందిన సుబ్బరాయుడు పట్టణంలోని ఓ బిస్కెట్ ప్యాక్టరీలో సూపర్వైజరుగా పని చేస్తున్నాడు. అక్కడ పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా కొర్రపాడురోడ్డులోని మల్లెలమ్మ గుడివద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది.
తీవ్రగాయాలైన సుబ్బరాయుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు కర్నూలుకు తీసుకెళ్తుండగా మార్గమాద్యంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: విజయవాడలో గుప్పుమంటున్న గంజాయి..!