కడప జిల్లా పాలెం పాపయ్య వీధికి చెందిన నజీర్ అనే వ్యక్తి చికెన్ దుకాణంలో పనిచేస్తుండేవాడు. జిల్లాలో కురిసిన భారీ వర్షానికి విద్యుత్తు తీగ తెగి చికెన్ దుకాణం పక్కన ఉన్న కడ్డీల బుట్టపై పడింది.
నజీర్... విద్యుత్ తీగను గమనించకుండా బుట్టపై చెయ్యి పెట్టడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు అక్కడకు చేరుకుని ప్రమాదం జరిగిన తీరుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.