కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలమకూరు ఐసీఎల్ ఫ్యాక్టరీ బయట నిలిపి ఉన్న టిప్పర్‌లో నిద్రిస్తున్న నాగార్జున (30) అనే డ్రైవర్ మృతి చెందాడు. రాత్రి టిప్పర్ క్యాబిన్‌లోనే నిద్రిస్తూ ఉదయానికల్లా మృతి చెందినట్లు తోటి డ్రైవర్లు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడు ఎర్రగుంట్ల పట్టణంలోని నారాయణ నగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త మరణవార్త విని ఇద్దరు పిల్లలతో అక్కడికి చేరకున్న భార్య కన్నీరుమున్నీరైన తీరు స్థానికులను కలచివేసింది.
ఇదీ చదవండి: చేయని నేరానికి పోలీసులు వేధిస్తున్నారంటూ.. యువకుడి ఆత్మహత్యాయత్నం