కడప జిల్లా రాజంపేట పశుసంవర్ధక శాఖ కార్యాలయ ఆవరణంలో శనివారం ఈ పథకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ గ్రామ పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకులు డాక్టర్ సురేష్ బాబు గ్రామంలోని రైతుల వద్ద ఎన్ని పాడి పశువులు ఉన్నాయో అన్నింటిని ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. ప్రభుత్వ కొత్తగా అమలు చేస్తున్న పశు నష్టపరిహార పథకం రైతుకు వరం లాంటిదని ఆయన తెలిపారు. ఇలా ఆన్లైన్ చేసిన పశువులు ఒకవేళ మృతిచెందితే వాటికి బీమా కంపెనీతో సంబంధం లేకుండా ప్రభుత్వమే పరిహారం చెల్లిస్తుందన్నారు. సంకరజాతి పశువులకు అయితే 30 వేల రూపాయలు, సాధారణ పశువు అయితే 15 వేల రూపాయల పరిహారం అందుతుందని వివరించారు. ఈ విషయాన్ని రైతులు తెలియజేసి వారి పశువులను నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.
ఇదీ చదవండీ :