ETV Bharat / state

Low Water Storage in Reservoirs: శ్రీశైలం వెలవెల.. కేసీ కెనాల్​కు నీటి విడుదల బంద్.. ఆయకట్టు రైతుల్లో ఆందోళన.. - రైతుల ఆందోళన

Low Water Storage in Reservoirs: వర్షాభావంతో.. రాయలసీమలో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడే ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయి. రాయలసీమకు ఆయువుపట్టువంటి శ్రీశైలం జలాశయంలోకి నీరు రాకపోవడంతో.. దానిపై ఆధారపడ్డ ప్రాజెక్టులు, ఆయకట్టు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉమ్మడి కడప-కర్నూలు జిల్లాల్లో ధాన్యం రైతులకు వరప్రదాయిని అయిన కేసీ కెనాల్‌కు ఈసారి నీటి విడుదల లేనట్లేననే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో 85 వేల హెక్టార్ల ఆయకట్టు బీళ్లుగా మారే పరిస్థితి కనిపిస్తోంది.

Low_Water_Storage_in_Reservoirs
Low_Water_Storage_in_Reservoirs
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 31, 2023, 7:46 PM IST

Low Water Storage in Reservoirs: ఆగస్టు ముగిసినా వర్షాల జాడ కనిపించలేదు. ఫలితంగా రాయలసీమ రైతాంగానికి.. అటు తెలంగాణ ప్రాంతానికి సాగునీరు అందించే శ్రీశైలం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి నీటి ప్రవాహం కనిపించడం లేదు. శ్రీశైలం నిండితేనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కర్నూలు, కడపజిల్లాల్లో వరి పంట సాగు చేసే ఆయకట్టుకు నీరందించే పరిస్థితి ఉండేది. కానీ నీళ్లు లేకపోవడంతో కర్నూలు-కడప కాల్వకు నీళ్లు వదలడం లేదు.

ఏటా జులై రెండో వారం లేదా జులై నెలాఖరు నాటికి కేసీ కాల్వకు నీళ్లు వదిలేవారు. దీంతో వరి రైతులు నారుమళ్లు వేసుకుని ఆగస్టు మొదటి వారం నుంచి వరినాట్లకు సిద్ధం అయ్యేవారు. ప్రస్తుతం వర్షాభావం కారణంగా శ్రీశైలం నుంచి నీటి విడుదల ఆగి పోవడంతో.. కేసీ కాల్వ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కాల్వకు నీళ్లు వదలుతారనే ఉద్దేశంతో రెండు నెలల నుంచి భూములను దుక్కిదున్ని వరి పంట వేయడానికి సేద్యాలు చేశారు.

Low Water Storage in Reservoirs: జలాశయాల్లో నీటి కొరత.. సెప్టెంబరులోనైనా వరుణుడు కరుణించాలని రైతుల ఆశలు

జులై మాసంలో నీళ్లు వదలకపోతే.. కనీసం ఆగస్టు నెలలోనైనా కాల్వకు నీళ్లు వస్తాయనే ఆశతో ఎదురు చూసిన అన్నదాతలకు నిరాశే మిగిలింది. ఆగస్టు నెల ముగిసినా చుక్కనీటి జాడ కాల్వల్లో కనిపించకపోవడంతో వేలాది ఎకరాలు కేసీ ఆయకట్టు బీళ్లుగా దర్శనమిస్తోంది. కడపజిల్లాలోని కేసీ కాల్వలో చుక్క నీరు లేక పోవడంతో వెలవెల బోతోంది. నీటిచెమ్మలేని కేసీ కాల్వ ఎడారిని తలపిస్తోంది. కేసీ కాల్వ కింద రెండు జిల్లాలో దాదాపు 85 వేల హెక్టార్ల ఆయకట్టు ఉంది. ఒక్క కడపజిల్లాలోనే దాదాపు 80 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. అంతా వరి పంట సాగు చేసే పరిస్థితి ఉండేది. ఈసారి నీళ్లు రాకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

కడపజిల్లాలో కేసీ కాల్వ కింద ప్రొద్దుటూరు, రాజుపాలెం, చాపాడు, ఖాజీపేట, మైదుకూరు, దువ్వూరు, చెన్నూరు, వల్లూరు, సీకేదిన్నె, కడప మండలాల పరిధిలో దాదాపు 35 వేల హెక్టార్లలో వరి పంట సాగయ్యేది. చాపాడు, ఖాజీపేట మండలాలల్లో అత్యధికంగా 20 వేల ఎకరాల చొప్పున వరి పంట సాగయ్యేది. మైదుకూరు మండలంలో 10 వేల ఎకరాల్లో వరి పంట ఏటా సాగు చేసేవారు రైతులు. ఇపుడు కాల్వకు నీరు విడుదల ఆగిపోవడంతో పొలాలన్నీ బీళ్లుగా దర్శన మిస్తున్నాయి.

Injustice to Grain Farmer under YCP Regime: ధాన్యం సేకరణను తగ్గించుకున్న ప్రభుత్వం.. దిక్కుతోచని స్థితిలో రైతు

కేసీ కాల్వకు ఈసారి నీటి విడుదల ఉండదని.. వరి సాగు చేయవద్దని జిల్లా అధికారులు మౌఖికంగా రైతులకు తేల్చి చెబుతున్నారు. రైతులు వరినాట్లు వేసుకోవద్దని.. ప్రత్యమ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని చెబుతున్నారు. వరిపంట సాగు చేయాలంటే వరసగా 4నెలల పాటు కేసీ కాల్వకు నీళ్లు వదలాల్సిన పరిస్థితి. ఏటా జులై నుంచి డిసెంబరు వరకు కేసీ కాల్వకు నీళ్లు వదిలేవారు. వరి పంట కోతకు రావాలంటే వంద రోజులు ఆగాల్సిందే.

ఇపుడు వర్షాభావం కారణంగా వరసగా నాలుగు నెలలు కాల్వకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదని అధికారులు చెప్పడంతో.. ఇప్పటికే వరినాట్లు వేసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. కాల్వకు నీళ్లు వస్తాయనే ఆశతో కేసీ కాల్వకింద దాదాపు వెయ్యి ఎకరాలకు పైగానే రైతులు పెట్టుబడి పెట్టి వరినాట్లు వేశారు. ఇపుడు నీళ్లు రావని తెలియడంతో గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట నుంచి పెన్నానది నీళ్లను కడప నగరవాసుల తాగునీటి అవసరాల కోసం కేసీ కాల్వ ద్వారా కడప చెరువుకు నీళ్లు వదిలారు.

ఈ రెండు మండలాల పరిధిలో రైతులు ఎవ్వరూ కూడా ఈ నీళ్లను చూసి వరి పైరు వేసుకోవద్దని.. ఇవి కేవలం తాగునీటి అవసరాల కోసమేనని స్పష్టం చేస్తున్నారు. కాగా కేసీ ఆయకట్టుకు శాశ్వత తాగునీటి అవసరాలను తీర్చడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసిన గుండ్రేవుల ప్రాజెక్టును ఈ ప్రభుత్వం విస్మరించడంతోనే సమస్య జఠిలమైందని అన్నదాతలు అంటున్నారు. ఈసారి కేసీ ఆయకట్టు వెలవెలబోతే బియ్యం ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం లేకపోలేదు.

No Rains in Anantapur District: చినుకు జాడ లేదయే.. సాగు చేసేది ఎలా..? ఉమ్మడి అనంత రైతన్న ఆవేదన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.