కడపజిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య వైభవంగా తితిదే నిర్వహిస్తోంది. సింహ వాహనంపై స్వామి, అమ్మవార్లు దర్శనమిచ్చారు. ఒంటిమిట్టలో మూడవరోజు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి ఉత్సవాల్లో సింహవాహనంపై స్వామి వారు సీతా, లక్ష్మణ సమేతంగా దర్శనమిచ్చారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహన సేవ నిర్వహించారు. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను స్వామివారు శిక్షించటానికి ప్రతీకగా సింహవాహనంపై దర్శనమిస్తారని పురాణాలు తెలియజేస్తున్నాయి.
ఇవీ చదవండి: