కడప జల్లాలో లాక్డౌన్ ఆంక్షలు కట్టుదిట్టంగా అమలవుతున్నాయి. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు అనుమతిచ్చారు. జిల్లా సరిహద్దులను మూసేశారు. ప్రజలు ఎక్కడా రోడ్లపై తిరగకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. రేషన్ డిపోల వద్ద ఉదయమే ప్రజలు బారులు తీరారు. వారందరూ సామాజిక దూరం పాటించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. దిల్లీకి వెళ్లొచ్చిన వ్యక్తితో పాటు అతని కుటుంబ సభ్యులకు ఇవాళ రిమ్స్‌లో కరోనా పరీక్షలు నిర్వహించారు. నమూనాలను తిరుపతికి పంపారు. జిల్లాలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: