ETV Bharat / state

పరిషత్​కు చివరి రోజు నామినేషన్ల వెల్లువ

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల దాఖలకు బుధవారం చివరి రోజు కావటంతో కడప జిల్లాలో అభ్యర్థులు పోటెత్తారు. ఎంపీటీసీ స్థానాలకు నిన్న ఒక్కరోజే అనూహ్యంగా 2,489 నామినేషన్లు వచ్చాయి. అర్ధరాత్రి 12.06 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగింది.

list of no of nominations filled for mptc and zptc

author img

By

Published : Mar 12, 2020, 10:29 AM IST

కడప జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు బుధవారం నామినేషన్లు వెల్లువెత్తాయి. ఎంపీటీసీ స్థానాలకు చివరిరోజు అనూహ్యంగా 2,489 నామినేషన్లు రావటం విశేషం. అర్ధరాత్రి వరకు కూడా నామినేషన్లు స్వీకరించారు. జడ్పీ కార్యాలయంలో అర్ధరాత్రి 12.06 గంటలకు చివరి అభ్యర్థిగా ఓబులవారిపల్లెకు చెందిన సుబ్బనరసయ్య స్వతంత్ర అభ్యర్థిగా నామపత్రం దాఖలు చేశారు. జమ్మలమడుగు డివిజన్​లో 16 జడ్పీటీసీ స్థానాలకు మొత్తంగా 89 మంది నామినేషన్లు వేశారు. కడప, రాజంపేట డివిజన్ల లెక్కలు రాత్రి 2.30 గంటల ప్రాంతంలో కొలిక్కి వచ్చాయి. 50 జడ్పీటీసీ స్థానాలకు జిల్లాలో మొత్తంగా 341 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు 553 ఉండగా... 2,792 నామపత్రాలు దాఖలయ్యాయి.

ఇదీ చదవండి:పల్నాడులో కర్రలు, కత్తుల స్వైరవిహారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.