Land Victim Selfie Video on YSRCP Leaders Grabbed his Land: స్వయాన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాకలో న్యాయం లభించటంలేదని.. నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన అక్బర్ బాషా తన ఆవేదనను వెల్లగక్కారు. వైసీపీ నాయకులు పేద ప్రజలను మోసం చేస్తూ.. బస్సుయాత్ర ప్రారంభించారని దానివల్ల ఎవరికి సామాజిక న్యాయం లేదని ఆరోపించారు. పొరపాటున కూడా రాష్ట్ర ప్రజలు జగన్కు మరోసారి అధికారం చేతికి ఇవ్వకూడదని అక్బర్ బాషా విజ్ఞప్తి చేశారు.
వైఎస్సార్ కడప జిల్లాలోని దువ్వురు మండలం ఎర్రబల్లి గ్రామం వద్ద భూ తగాదా విషయంలో.. తనకు న్యాయం జరగటం లేదని అక్బర్ బాషా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ గుండాలు తన భూమి తనకు కాకుండా చేసి.. సాగు చేసుకుంటున్నారని వాపోయారు. తన భూమి తనకు ఇప్పించకుండా జగన్ రెడ్డి.. తిరుపతి రెడ్డికి క్యాబినేట్ పదవి అప్పగించారని మండిపడ్డారు. కోర్టు ఆర్డర్లను సైతం వైసీపీ నాయకులు లెక్క చేయటం లేదని.. పోలీసులు కూడా వారికే వత్తసు పలుకుతున్నారని నిస్సహాయతను వ్యక్త పరిచారు. ఎవరికి చెప్పినా కనీసం వినడం లేదని అన్నారు. ఇప్పటికైనా న్యాయం జరగకపోతే తన భార్య పిల్లలతో కలిసి.. కడపలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.
వైసీపీ సామాజిక న్యాయం అంటూ బస్సుయాత్ర నిర్వహిస్తోందని.. అసలు దీనివల్ల ఎవరికి న్యాయమని ప్రశ్నించారు. కేవలం వైసీపీ పాలనలో జగన్ రెడ్డి వర్గం వారికే న్యాయం జరుగుతోందని అన్నారు. జగన్ పాలనలో ముస్లింలకు, పేదవారికి న్యాయం జరగడం లేదని ఆరోపించారు. వైసీపీ నాయకులు తమను బస్సు కింద తొక్కించి సామాజిక బస్సు యాత్రను కొనసాగించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడైనా ముఖ్యమంత్రి మనస్సు ప్రశాంతంగా ఉంటుందని ఆరోపణలు చేశారు.
తాను సాగు చేసుకోవాల్సిన భూమిని వైసీపీ నాయకుడు తిరుపతి రెడ్డి.. తన గుండాల బలంతో సాగు చేసుకుంటున్నాడని ఆరోపించారు. తన భూమిలో కాలు పెడితే తిరుపతి రెడ్డి హత్య చేయడానికి కూడా వెనకడడం లేదని అక్బర్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో పేదలను బతకనివ్వరని అన్నారు.
ఇప్పటివరకు సీఎం జగన్ చేసిన సహాయం చాలని.. ఇకపై మాకు ముఖ్యమంత్రిగా మాకు వద్దని అన్నారు. నంద్యాల జిల్లాలోనే కాదు.. జగనన్నా రాష్ట్రంలో ఎవరికి న్యాయం చేయాడని విమర్శించారు. ఈ నాలుగు సంవత్సరాల్లో వైసీపీ అరాచకాల వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారోనని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగకపోతే రాబోయే రోజుల్లో తను బస్సుయాత్రను ప్రారంభిస్తానని హెచ్చరించారు. తనకు ఇంతవరకు సహాయం చేసిన రాష్ట్ర ప్రజలకు ఆయన ధన్యావాదలు తెలిపారు. రాబోయే తరాల వారి భవిష్యత్ కోసం ఇంకోసారి జగన్ రెడ్డికి అధికారం ఇవ్వకూడదని రాష్ట్ర ప్రజలను కోరారు.
అసలేంటి ఈ భూ కబ్జా : నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన అక్బర్ బాషాకు కడప జిల్లాలోని ఎర్రబెల్లి గ్రామం వద్ద భూమి ఉంది. దీనిని వైసీపీ నాయకుడు తిరుపాల్ రెడ్డి అనే వ్యక్తి అక్రమించుకుని సాగు చేసుకుంటున్నారని ఆయన న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనిపై పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు నిర్వహించినట్లు అక్బర్ బాషా వివరించారు. కోర్టు కూడా తనకు అనుకూలంగానే ఆర్డర్లు ఇచ్చినట్లు తెలిపారు. భూ పోరాట విషయంలో తనకు న్యాయం చేస్తానని.. వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు సురేశ్ బాబు మోసం చేశాడని ఆరోపించారు.
తన భూమి తనకు కావాలంటే.. సురేశ్ బాబు 10లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు వివరించారు. సురేశ్ బాబుకు 10 లక్షలు ఇస్తానన్న కూడా తనకు భూ తగాదా విషయంలో న్యాయం జరగలేదని అన్నారు. దీంతో గతంలో ఆత్మహత్యాయత్నానికి పూనుకున్నట్లు గుర్తు చేశారు. కొంత సమయానికి న్యాయం చేస్తానని సురేశ్ రెడ్డి హామీ ఇచ్చాడని తీరా చూస్తే ఇప్పుడు మళ్లీ అక్రమించుకున్న వారే సాగు చేసుకుంటున్నారని వాపోయారు. గతంలో తన చేత ప్రెస్ మీట్ పెట్టించి జగన్ దేవుడని చెప్పించాడన్నారు.
Land Occupation: ఆ మంత్రుల నియోజవర్గాల్లో యథేచ్ఛగా భూ అక్రమాలు..