కడప జిల్లా రైల్వే కోడూరులో ప్రభుత్వం నిర్మిస్తున్న మద్యం దుకాణాన్ని మూసివేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మహిళలు, కళాశాల విద్యార్థులు ధర్నా చేశారు. అధికారమిస్తే మద్యం నిషేధిస్తామన్న వైకాపా హామీ ఏమయ్యిందని ప్రశ్నించారు. విడతల వారీ నిషేధం పోయి ఇప్పుడు నివాసంలో మధ్యలో మద్యం దుకాణాలు ఏర్పాటుకు అనుమతులిచ్చారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు సీహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కళాశాల, పాఠశాల, సమీపంలో, నివాసాల మధ్యలో మద్యం దుకాణాలకు ఏ విధంగా అనుమతులిచ్చారని ఎక్సైజ్ డిపార్టుమెంటును, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యార్థినులు మాట్లాడుతూ మద్యం దుకాణాలతో యువతపై ప్రభావం పడుతుందనీ, వెంటనే వాటిని మూసివేయాలని కోరారు.
ఇదీ చదవండి: