భారీ వర్షాలకు కర్నూలు జిల్లా కుందునది పొంగి పొర్లుతోంది. ఎగువ ప్రాంతైన పోతిరెడ్డిపాడులో విడుదల చేసిన నీటితో వరద ఉద్ధృతి మరింత పెరిగింది. జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం మండలం నెమల్ల దిన్నె, మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం సీతారామ పురం వద్ద వంతెనపై నుంచి నీరు ప్రవేశించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నెమల్ల దిన్నెతో పాటు చిన్నముడియం గరిసలూరు, బలపనూరు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు సూచించారు. రెండు రోజుల కిందట కుందూనదిలో 17 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా గురువారం 26వేల500 క్యూసెక్కులకు చేరుకుంది. ఈరోజు ఉదయం 31 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి