కడప జిల్లాలో కుందూ, పెన్నా నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. పోతిరెడ్డిపాడు నుంచి విడుదల చేసిన నీటితో నదుల్లో జలకళ సంతరించుకుంది .రాజోలి ఆనకట్ట 15800 క్యూసెక్కుల ప్రవాహంతో కళకళలాడుతోంది. కుందూనదిలో ప్రవహించే నీటికి వర్షపు నీరు చేరడంతో ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట నీటి సవ్వడి నెలకొంది. పెన్నానదిలోని నీరు దిగువన సోమశిల జలాశయానికి చేరుతోంది.
ఇది చూడండి: భారీ వర్షాలకు ఉత్తరాది విలవిల- 38కి మృతులు