కడప జిల్లా రైల్వేకోడూరు పరిధిలోని రాఘవరాజపురంలో ఇటీవల చెన్నై నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మండల ఆరోగ్య సిబ్బంది అతన్ని కడప రిమ్స్‌కు తరలించారు. చెన్నైలో ఉద్యోగం చేస్తున్న అతను రెండు వారాల కిందట స్వగ్రామమైన రాఘవరాజపురం వచ్చాడు. వారం నుంచి తీవ్రమైన గొంతు నొప్పి, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతుండటంతో... కడపలోని కరోనా ప్రత్యేక చికిత్స విభాగానికి తరలించారు. అయితే అతని చెన్నైలో ఉన్నప్పుడు తన స్నేహితునికి కరోనా వ్యాధి ఉన్నట్లు నిర్ధరణ అయినట్లు వైద్య సిబ్బందికి తెలిపాడు.
ఇవీ చదవండి...కుప్పంలో 80 ఏళ్ల వృద్ధుడికి కరోనా లక్షణాలు!