నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాదనీ.. ప్రజల సేవకుడని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రెండు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా నేడు దేవుని కడప శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నెహ్రూ పార్కులో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మొదటగా ఆయనే రక్తపోటు పరీక్ష చేయించుకున్నారు. ప్రధాని జన్మదినం సందర్భంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. దేశం పదిలంగా ఉండడానికి కారణం మోదీ నాయకత్వమే అనీ.. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మోదీ ప్రధానమంత్రి కాదని ప్రజలకు ప్రధాన సేవకుడు అని కన్నా అన్నారు.
ఇవీ చదవండి..