సీఎం జగన్ (cm jagan) ఈనెల 8,9 తేదీల్లో కడప జిల్లాలో (kadapa district) పర్యటించనున్న దృష్ట్యా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ అన్బురాజన్.. (kadapa sp Anburajan ) సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు కడప పోలీసు కార్యాలయంలో డీఎస్పీ, సీఐలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని కడప, పులివెందుల, ఇడుపులపాయ, బద్వేల్ ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తారని వెల్లడించారు.
ఆయా ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు పక్కాగా ఉండాలన్నారు. హెలిప్యాడ్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉంచేలా డీఎస్పీలు పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు. సీఎం వద్దకు వెళ్లే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపాలని సూచించారు. సీఎం పర్యటన ముగిసేంత వరకు ఎలాంటి తేడాలు రాకుండా చూడాలన్నారు.
ఇదీ చదవండి: