కడప జిల్లాలో కొంతమంది ప్రజలు మాస్కులు లేకుండా తిరుగుతుండటంతో.. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇప్పటి వరకు 986 కేసులు నమోదయ్యాయని.. రూ.1,46,900 జరిమానా విధించినట్లు జిల్లా అన్బురాజన్ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో ప్రజలు తమ వంతు బాధ్యతను గుర్తించి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించాలని సూచించారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీచదవండి.