కడప జిల్లా కాశి నాయన మండలం నల్లమల అడవుల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.3 లక్షల విలువైన 23 ఎర్రచందనం దుంగలను, ఓ వాహనాన్ని పోరుమామిళ్ల అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్న మునీంద్ర అనే వ్యక్తిని అరెస్టు చేశామని ఎఫ్ఆర్ఓ తిరుమలేష్ వెల్లడించారు.
ఎర్రచందనం అక్రమ రవాణాపై సమాచారం రావడంతో కాశినాయన నల్లమల అడవుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు.ఈ క్రమంలో కాశి నాయన మండలం నాయన పల్లి కి చెందిన మునీంద్ర పట్టుబడగా మిగిలిన వారు తప్పించుకొని పారిపోయారు. ఎఫ్ ఆర్ ఓ తిరుమలేష్ వెల్లడించారు. తప్పించుకుని పారిపోయి వారిని త్వరలో పట్టుకుంటామని వివరించారు . నిందితున్ని బద్వేలు న్యాయస్థానం ఎదుట హాజరు పరిచినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: RED SANDLE: 800 కిలోల ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. ఐదుగురు అరెస్టు