కడప జిల్లా రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేట బీసీ కాలనీకి చెందిన ఇర్ల సురేశ్ అనే వ్యక్తి కువైట్లో మృతి చెందాడు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సురేశ్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని మరణ వార్త తెలుసుకొని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.
పొట్టకూటి కోసం కువైట్కు వలస వెళ్ళిన సురేష్ అక్కడ డ్రైవర్గా పని చేసేవాడు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. చిన్న వయసులోనే కిడ్నీ సంబంధిత వ్యాధితో సరేశ్ మృతి చెందటంతో అనంతరాజుపేట బీసీ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. సురేశ్ మృతదేహాన్ని త్వరగా స్వస్థలానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని బంధువులు వేడుకుంటున్నారు.