రాష్ట్రంలో ఎక్కడ వైకాపా దూసుకెళ్తుందని ప్రశ్నిస్తే... ముందు గుర్తొచ్చే... పేరు కడప. వైఎస్ కుటుంబానికి పుట్టినిల్లైన కడప గడ్డ.. వైకాపాకు పెట్టని కోట. 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2014 ఎన్నికల్లో 9 చోట్ల వైకాపా అభ్యర్థులే గెలిచారు. రాజంపేట మినహా... మిగిలిన అన్ని చోట్లా ఫ్యాను గాలే వీచింది. ఈసారీ తమదే హవా అంటూ వైకాపా చెబుతుండగా... సొంతగడ్డపైనే వైకాపాకు షాక్ ఇవ్వాలని పసుపుదళం ప్రయత్నాలు చేస్తోంది. దాదాపు రెండేళ్ల కిందటి నుంచే ప్రణాళికలు అమలు చేస్తూ వస్తోంది.
ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెదేపా వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. అభివృద్ధి... రాజకీయంతో వైకాపాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తన సహజ వైఖరికి భిన్నంగా ఈసారి అభ్యర్థుల ఎంపికను ముందే పూర్తి చేస్తూ.. చంద్రబాబు దూసుకెళ్తున్నారు. తాజాగా కడప, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాలపై చర్చల సందర్భంగా... కడప జిల్లాలో బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చింది. జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి సూచనల మేరకు అభ్యర్థుల ఎంపిక పూర్తైంది.
కడప "కుంభస్థలం" కొడతారా...? - పుట్టా
కడప గడపలోకి చొచ్చుకెళ్లేందుకు... తెదేపా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మరికొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కడప గడ్డపై పసుపు పతాకం ఎగరేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. ప్రతిపక్ష వైకాపా కంచుకోటగా ఉన్న చోటే ఆ పార్టీని దెబ్బతీయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. పార్లమెంట్‌కు గట్టి అభ్యర్థిని నిలిపి... ఎక్కువ ఎమ్మెల్యే సీట్లను గెలవాలన్న వ్యూహాన్ని అమలు చేస్తోంది. మరి... తెదేపా ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయి... ? అక్కడ ఫ్యాను స్పీడును ఏమాత్రం తగ్గించగలుగుతుంది...?