నివర్ తుపాను ప్రభావంతో కడప బుగ్గవంక బాధిత గ్రామాల్లో బురద అలానే ఉంది. దుర్గంధం వెదజల్లే స్థితిలో ఇరుకు వీధుల్లో కాలం వెల్లదీస్తున్నారు స్థానికులు. ఇంట్లో ధాన్యం మొత్తం తడిసి పోవడంతో దాతలు పంపించే భోజనం ప్యాకెట్ల కోసం బాధితులు ఎదురు చూస్తున్నారు. వస్తుసామగ్రి మొత్తం నీళ్లలో కొట్టుకుపోయి.. కట్టుబట్టలతో మిగిలారు. కనీసం ఇంటిముందు నిలిచిన చెత్త, బురదను తొలగించడానికి కూడా మున్సిపల్ అధికారులు రావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు ఓట్ల కోసం ప్రతిగడప తిరుగుతారు... ఇలాంటి సమయంలో మాత్రం కనిపించరనే ఆక్రోశం బాధితుల్లో వ్యక్తం అవుతోంది.
ఇదీ చదవండి: కర్షక పోరు: ఈ ఐదు ప్రశ్నలకు బదులేది?