కడప నగర పాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా సురేశ్ బాబు పేరు దాదాపు ఖరారయ్యింది. జిల్లా కేంద్రంలోని 50 డివిజన్లలో 48 కైవసం చేసుకున్న వైకాపా.. మేయర్ పీఠాన్ని రెండోసారి సురేశ్‌కే కట్టబెట్టనుంది. ఆయన.. నాలుగో డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఏకగ్రీవంతో ఎన్నికయ్యారు. ఈ నెల 18న మేయర్, పుర చైర్మన్ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనున్నారు. కడప కార్పొరేషన్ మేయర్ స్థానం బీసీకి రిజర్వ్ అవ్వటంతో.. సురేశ్ పదవి దక్కించుకోనున్నారు.
ఇదీ చదవండి: మేయర్లు, ఛైర్మన్ల పీఠాలపై సీఎం కసరత్తు