కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలలో ఉపాధ్యాయులు పిల్లలకు ఆదర్శంగా ఉండాలని కడప జేసీ సాయికాంత్ వర్మ అన్నారు. పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం కడప జెడ్పీ ఆవరణలో కొవిడ్- 19 నియమ నిబంధనలపై సమావేశం ఏర్పాటు చేశారు. కొవిడ్ నియంత్రణ పద్ధతులు పాటించడంలో.. ఉపాధ్యాయులు కచ్చితంగా ఉండాలని జేసీ సూచించారు.
పక్కవారితో ఎలా నడుచుకోవాలి ? భౌతిక దూరం ఎలా పాటించాలి ? వ్యక్తిగత శుభ్రత వంటి అంశాలపై పిల్లలకు అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ విధి విధానాలను, మార్గదర్శకాలను తూచా తప్పక పాటించాలన్నారు.
ఇదీ చదవండి: పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే: సీఎం జగన్