గండికోట ఉత్సవాల ఏర్పాట్లు పరిశీలించిన జాయింట్ కలెక్టర్ కడప జిల్లాలో ఈ నెల 11,12 తేదీల్లో రెండు రోజుల పాటు గండికోట ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం కోటను ముస్తాబు చేస్తున్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎం. గౌతమి కోట వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్సవాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లన్నీ పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన కమిటీలకు అప్పగించిన బాధ్యతలను బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని సూచించారు. అవసరమైన ప్రదేశాలలో బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖ అధికారులను ఆదేశించారు. యువతను ఆకర్షించే విధంగా అడ్వెంచర్ స్పోర్ట్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రధానంగా జుమ్మా రింగ్, పారా గ్లైడింగ్, కయాకింగ్ వంటి ఆటలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈసారి ప్రత్యేకంగా గాలిపటాల ఉత్సవం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: పులివెందులలో డయాలసిస్ సెంటర్ ప్రారంభం