కరోనా వైరస్ పంజా విసురుతున్న సమయంలో కడపలో పోలీసులు మాస్కులపై అవగాహన కల్పించారు. కడప జిల్లాలో రెండు రోజుల వ్యవధిలో 183 కేసులు నమోదు కావటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ సూర్యనారాయణ సమక్షంలో పోలీసులు వీధుల్లో తిరుగుతూ మాస్కులు ధరించాలని సూచించారు. మాస్కులు లేకుండా బయటికి వస్తే రూ. 500 జరిమానా విధిస్తామని డీఎస్పీ హెచ్చరించారు.
ఇదీ చూడండి
వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది?: తెదేపా