వాటర్ గ్రిడ్ కింద మంజూరు చేసిన ఇంటింటి కుళాయిలకు సంబంధించి వచ్చే ఏడాది మార్చి నాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టినట్లు కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే రఘురాం రెడ్డి తెలిపారు. ఈ నెలాఖరు నాటికి పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
నియోజకవర్గంలోని సచివాలయాలకు రూ. 3 కోట్లతో సిమెంటు రోడ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మురుగు కాలువల కోసం మరో రూ. 10 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. బ్రహ్మంసాగర్ జలాశయంలో దాదాపు 14 టీఎంసీలు నీరు నిల్వ చేసేలా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బ్రహ్మంగారిమఠం, బద్వేలు నియోజకవర్గాల పరిధిలోని రైతులకు రబీలో పంట సాగుకు నీరు అందుబాటులో ఉందని స్పష్టంచేశారు. భారీ వర్షాలతో పంట దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని చెప్పారు.
ఇవీ చదవండి..