పండుగలు అనేవి ఆనందాన్ని ఆహ్లాదాన్ని పంచేలా ఉండాలని.. ప్రమాదాలకు, ప్రాణనష్టాలకు కారకాలు కాకూడదని కడప జిల్లా జేసీ గౌతమి చెప్పారు. స్థానిక కలెక్టరేట్ స్పందన హాలులో దీపావళి పండుగను పురస్కరించుకుని బాణసంచా స్టాళ్ల అనుమతులు, భద్రతా చర్యలు, కొవిడ్ నిబంధనల పాటింపు.. తదితర అంశాలపై జిల్లా స్థాయి కమిటీతో సమావేశం నిర్వహించారు.
కొవిడ్-19 నియమ నిబంధనలు, అన్ని రకాల భద్రత చర్యలు పాటిస్తూ.. సంప్రదాయ పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలను సంతోషంగా నిర్వహించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఒక్క బాణసంచా దుకాణం నిర్వహించకూడదని, నిబంధనలను ఉల్లంఘించే షాపులను సీజ్ చేయాలన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టాళ్లలోనే టపాసులు కొనుగోలు చేయాలని సూచించారు.
ఇవీ చూడండి: