కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం తుమ్మలపల్లె ఎస్సీ కాలనీలోని పోలింగ్ కేంద్రం ఏర్పాటులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. గ్రామంలోని స్కూల్లో పోలింగ్ కేంద్రం ఉన్నప్పటికీ.. ఎస్సీ కాలనీ వాసులకు టెంట్లు వేసి ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఇదే తరహాలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంలో వారిని నిర్లక్ష్యం చేయడం తమ ఉద్దేశం కాదని ఎర్రగుంట్ల ఎంపీడీఓ శివారెడ్డి అన్నారు. భవనాలు లేకపోవడంతోనే తాత్కాలికంగా టెంట్లు వేసి ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: