కడప సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం రజతోత్సవాలను ఈనెల 29, 30 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నారు. జానమద్ధి హనుమచ్ఛాస్త్రి బ్రౌన్ గ్రంథాలయం నిర్మాణం కోసం ఎనలేని కృషి చేశారని యోగివేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి సూర్య కళావతి వెల్లడించారు. ఈ రజతోత్సవాలకు సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించామని ఉపకులపతి తెలిపారు. జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కవులు, కళాకారులను కూడా ఆహ్వానించామని పేర్కొన్నారు. అలాగే నేడు విశ్వవిజ్ఞాన వేదిక-గ్రంథాలయం అనే అంశంపై అంతర్జాల శతాధిక కవి సమ్మేళనం నిర్వహించారు.
ఇదీ చదవండీ...సమస్యల నడుమ సీపీ బ్రౌన్ గ్రంథాలయ రజతోత్సవాలు