కడప సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం రజతోత్సవాలు ముగిశాయి. బ్రౌన్ గ్రంథాలయం స్థాపించి పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 29, 30 తేదీల్లో రజతోత్సవాలు నిర్వహించారు. నేడు అష్టావధానం, సంగీతావధానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో పలువురు సాహితీ వేత్తలను బ్రౌన్ గ్రంథాలయం తరపున సత్కరించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే ... విజయవంతంగా రజతోత్సవాలను పూర్తి చేశామని వైవీయూ రిజిస్ట్రార్ రాఘవ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైవీయూ రిజిస్ట్రార్ రాఘవ ప్రసాద్ తో పాటు, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కేతు విశ్వనాథ్ రెడ్డి, పలువురు తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ...ఇండియన్ ఐడల్లో విశాఖ యువతి షణ్ముఖప్రియ ప్రతిభ