ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని కడప రిమ్స్ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ విభాగంలో రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ సి. హరికిరణ్ ప్రారంభించారు.
రక్తదానం మహాదానం.రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేరు. రక్తదాతలు ఎవరైనా రక్తాన్ని దానం చేసి, మరొకరి ప్రాణాలను కాపాడవచ్చు. రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. 18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల లోపు ఉన్నవారు రక్తదానానికి అర్హులు. కనీసం రక్తదాతల శరీర బరువు 50 కిలోలు ఉండాలి. రోగ నివారణ కోసం, ప్రమాదాల సమయంలో బాధితుల శరీరంలో తగినంతగా రక్తం లేకపోతే... మరొకరి నుంచి రక్తాన్ని ఎక్కిస్తారు.... సి.హరికిరణ్, కలెక్టర్
రక్తదాతలను శాలువా, మెమెంటో, ప్రశంసా పత్రాలతో కలెక్టర్ సత్కరించారు.
ఇదీ చూడండి: 'ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి'