కడప జిల్లాలో బస్సులు రోడ్ల మీదకి వస్తున్నాయి. ఆర్టీసీ బస్టాండ్లన్నీ బస్సులు, ప్రయాణికులతో కళకళలాడాయి. కరోనా నేపథ్యంలో బస్టాండ్లో శానిటేషన్ ఏర్పాటు చేసి ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్న నిబంధన పెట్టారు. 60 ఏళ్లకు పైబడిన వృద్ధులను బస్సుల్లోకి అనుమతించకపోవడంతో... ప్రయాణం కోసం వచ్చిన కొందరు ప్రయాణికులు వెనుదిరిగారు. ఆధార్ కార్డు ఆధారంగా వయసు నిర్ధరిస్తూ టికెట్లు జారీ చేశారు.
జిల్లావ్యాప్తంగా 182 బస్సులు రోడ్లపైకి రాగా రాయచోటి డిపో నుంచి ముప్పై బస్సులను ప్రధానమైన తిరుపతి, కడప, రాజంపేట, మదనపల్లి, వేంపల్లి, చిన్నమండెం ,రాయవరం మార్గాలలో బస్సులు నడిపారు. ప్రయాణికులు లేక కొన్ని బస్సులు ఒకరిద్దరితోనే తిరగాల్సి వచ్చింది. కడప-తిరుపతి బస్సులో భౌతిక దూరం పాటించేలా సీట్లకు మార్కింగ్ ఏర్పాటు చేశారు. అంతర్జాలంలోనూ టికెట్ల బుకింగ్ విధానాన్ని ప్రారంభించారు. ఆర్టీసీ కల్పిస్తున్న వివిధ రాయితీ పాసులను రద్దు చేశారు.
ఇది చదవండి 'ప్రజలు బాధపడితే ప్రభుత్వాలకు మనుగడ ఉండదు