కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కడప రిమ్స్‌లో జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి ఓపి వద్ద నిరసన చేపట్టారు. దాదాపు రెండు గంటల పాటు చేపట్టిన ఆందోళనలో.. రోగులను ఓపిలోకి వెళ్లనివ్వకుండా జూడాలు అడ్డుకున్నారు. దీనితో వైద్యం కోసం వచ్చిన రోగులు అవస్థలు పడ్డారు. ఎన్ఎమ్ఎసీ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. మెడికల్ బిల్లు వల్ల కలిగే అనర్థాలను జూడాలు పాటల రూపంలో వారి ఆవేదన వ్యక్తం చేసారు. ఈ బిల్లుతో కేవలం ఆరు నెలల్లోనే డబ్బులు ఉన్నవారికే ఎంబీబీఎస్ పత్రం వస్తుందని, దీంతో పేద విద్యార్థులు నష్టపోతారని పేర్కొన్నారు. కేవలం కార్పొరేట్ వ్యవస్థకే వైద్యం అందుతోందని నిరుపేద మధ్య తరగతి విద్యార్థులకు వైద్య వృత్తి అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు. ప్రజల కోసమే తాము ఆందోళన చేస్తున్నామని జూడాలు పేర్కొన్నారు.
ఇదీచూడండి.ట్రెండ్ మారినా...ఫ్రెండ్ మారడు!