లాక్ డౌన్ కారణంగా తినడానికి కూడా లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే విద్యుత్ చార్జీలు పెంచటం దారుణమని కడప జనసేన అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుంకర శ్రీనివాస్ మండిపడ్డారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కడపలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రజలు 151 సీట్లు ఇచ్చి అధికారం కట్టబెడితే ఇప్పుడు వైకాపా సర్కార్ చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరి ఇప్పుడు ప్రజలకు కరెంటు షాక్ ఇచ్చారని ఆరోపించారు. ప్రభుత్వ స్థలాల విక్రయ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ చార్జీలు పెంపుపై జనసేన ఖండన
కరెంటు బిల్లు చార్జీలు పెంచటాన్ని కడప జిల్లా జనసేన అసెంబ్లీ ఇన్చార్జీ శ్రీనివాస్ ఖండించారు. ఇందుకు నిరసనగా జిల్లాలో నిరసన కార్యక్రమం చేపట్టారు.