Janasena PAC Chairman Nadendla Manohar: వైఎస్సార్ కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి సంవత్సరమవుతున్నా.. నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. కడప జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు జనసేన నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని ఆరోపించారు.
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో జరిగిన ఘోరంపై పది రోజుల తరువాత ఆయన స్పందించారని నాడెండ్ల గుర్తు చేశారు. మూడు నెలల్లో ఇంటి తాళాలు ఇస్తామన్న సీఎం హామీ నెరవేరలేదని ఎద్దెవా చేశారు. అన్నమయ్య ప్రాజెక్ట్ నిర్వాసితుల పరిస్థితిపై జనసేన అధినేత పవన కల్యాణ్‌కు నివేదిక ఇస్తామన్నారు. మోదీతో పవన్ భేటీ నిర్ణయాలను జనసేన వెల్లడించదని... భేటీపై వస్తున్న రూమర్స్ అర్థరహితమన్నారు.
పెడన ఘటనపై స్పందించిన నాదెండ్ల మనోహర్: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ అనుచరులు వీరంగం సృష్టించడంపై నాదెండ్ల మనోహర్ స్పందించారు. పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల ముందే జనసేన కార్యకర్తలపై దాడికి దిగారని ఆరోపించారు. దాడి జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న ఎస్ఐ, పోలీసు సిబ్బంది ఆపకుండా చోద్యం చూశారని నాదెండ్ల వెల్లడించారు. పోలీసులు చూస్తుండగానే దర్జాగా దౌర్జన్యం చేసి వెళ్లిపోయారని తెలిపారు. పోలీసులు మాత్రం జనసేన కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: