కడప జిల్లా రాయచోటికి చెందిన జకియా ఖానం కు.. ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. గవర్నర్ కోటాలో ఆమె మండలి సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఆమె.. మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్, దివంగత అఫ్జల్ అలీఖాన్ సతీమణి. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు.. రాయచోటి వాసికి ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారంటూ స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
గవర్నర్ బిశ్వభూషణ్.. జకియా ఖానం అభ్యర్థిత్వంపై ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదించగా.. ఆమె ఎమ్మెల్సీ అయ్యారు. ఎన్నికల ముఖ్య అధికారి విజయానంద్.. ఈ విషయమై గెజిట్ విడుదల చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట్ శ్రీకాంత్ రెడ్డి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్కు, తన పేరు ప్రతిపాదించిన శ్రీకాంత్ రెడ్డికి.. జకియా ఖానం ధన్యవాదాలు చెప్పారు.
ఇవీ చదవండి: